హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై నిర్ణయ భాధ్యత కాంగ్రెసు పార్టీదే: బాబు

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: టీఆర్ఎస్ ఓ బ్లాక్ మెయిలింగ్ పార్టీ. దండుకోవడం తప్ప అది చేసిందేమీ లేదు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెసు ల కన్నా టీడీపీకే బలమైన కేడర్ ఉందన్నారు. పులివెందుల, కుప్పం తప్ప అన్ని స్ధానాల్లో గెలుస్తామని ప్రగల్ఫాలు పలికిన చిరంజీవి అడ్రస్ లేకుండా పోయాడని ఎగతాళి చేశారు. టీడీపీని బలపరచింది ప్రత్యేకంగా బీసీలేనని, వారి సంక్షేమానికి నిత్యం శ్రమిస్తామన్నారు. గ్రామస్ధాయి నేతలను, కొత్త నాయకత్వాన్ని ప్రమోట్ చేసే క్రమంలో పార్టీ మండల శాఖల అధ్యక్షులు పూర్తి స్ధాయిలో శ్రమించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెలంగాణ అంశంపై టీడీపీని అప్రదిష్ట పాల్జేసేందుకు కొన్ని పార్టీలు పదేపదే యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆంధ్రలో పీఆర్పీని, తెలంగాణలో టీఆర్ఎస్ ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెసు యత్నాలు ఇంకా సాగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణపై పార్టీ వైఖరిని ఎప్పుడో స్పష్టం చేశాం. ఈసున్నితమైన అంశంలో ఏ పరిణామానికైనా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెసు దే భాధ్యత అన్నారు. గత ఎన్నికల్లో అంటే 2009 ఎన్నికల్లో కేవలం ఒక్క శాతం ఓట్లతోనే టీడీపీ ఓడిందని, ఇక కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు పార్టీ వారే, సీఎంగా గుర్తించడం లేదని పేర్కొన్నారు.

English summary
Telugudesam President Chandrababu accused that the TRS party which was formed for the cause of Telangana has not done anything for Telangana. Congress has already merged the PRP party and now it is in the process of merging TRS also. Ultimately, it is the Congress responsibility to decide on State bifurcation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X