భువనేశ్వర్: ఒరిస్సా రాష్ట్రంలో తనను లైంగికంగా వేధించిన తన ఉన్నతాధికారిని చీపురుతో కొట్టి ప్రతీకారం తీర్చుకుంది ఓ ఉద్యోగిని. భువనేశ్వర్ పరిసర గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న సుచిత్రా రాయ్ అనే మహిళా ఉద్యోగిని ఆమె పై అధికారి మండల విద్యాధికారి వేధింపులకు పాల్పడినాడు. దీంతో రెచ్చిపోయిన సదరు మహిళా ఉపాధ్యాయురాలు విద్యాధికారిని గ్రామస్తులు అందరి ముందు చీపురు తీసుకొని కొట్టింది.
సదరు అధికారు గత కొన్నాళ్లుగా తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆమె చెప్పారు. చీటికి మాటికి తనిఖీల పేరుతో తన పాఠశాలకు వచ్చి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. అతను ప్రతిసారి తనిఖీల పేరుతో వచ్చి తనను వేధిస్తున్నప్పటికీ తాను మౌనంగా ఉంటున్నానని అయితే అతని ఆగడాలు శృతిమించడంతో కొట్టినట్లు చెప్పింది.