అసభ్య సందేశాలు పంపినందుకు రేడియో జాకీ అరెస్టు

ఈ విషయాన్ని గ్రహించలేక పోయిన ఆమె సావిక్ తో స్నేహ పూర్వక సాన్నిహిత్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే తన ఫోన్ నెంబర్ ని కూడా సావిక్ కు ఇచ్చింది. అయితే తొలి నాళ్లలో స్నేహపూర్వక సందేశాలు పంపిన నిందితుడు క్రమంగా ప్రతి రోజు 50 అసభ్యకర సందేశాలను పంపటం మొదలు పెట్టాడు. సావిక్ ఉద్దేశాన్ని గమనించిన బాధితురాలు విషయాన్ని పెద్దది చేయకుండా మందలించి వదిలేసింది.
బాధితురాలి హెచ్చరికులు పట్టించుకోని సావిక్ తన పంధాను కొనసాగిస్తూనే ఉన్నాడు. విసుగు చెందిన బాధితురాలు సాకేత్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. సావిక్ ను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు అతడి కేరీర్ ను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ తో సరిపెట్టేశారు. పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం కొద్ది రోజులు గుప్ చిప్ గా ఉన్న సావిక్ తన ఉన్మాదచర్యలను మళ్లి పునరావృతం చేశాడు.
ఒకే రోజులు 200 అసభ్యకర సందేశాలను బాధితురాల మొబైల్ కి పంపటంతో బెంబేలెత్తిన ఆమె మళ్లి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసిన పోలీసులు సావిక్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనికి బెయిల్ మంజూరు కావటంతో వదలిపెట్టామని డీసీపీ ఛాయా శర్మ తెలిపారు.