నార్వే టెర్రర్ దాడి: పేలుడు, కాల్పుల్లో 87 మంది మృతి
International
oi-Pratapreddy
By Pratap
ఓస్లో: నార్వేలో జరిగిన కాల్పుల్లో, బాంబు పేలుడులో 87 మంది మరణించారు. ఓస్లోలో ఓ యూత్ క్యాంప్‌పై పోలీసు కాల్పులు జరపడం వల్ల, ప్రభుత్వ భవనాల్లో బాంబు పేలుళ్లు సంభవించడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 80 మంది మరణించినట్లు తెలుస్తోందని, ఆ సంఖ్య ఎక్కువగా కూడా ఉండవచ్చునని ఓ పోలీసు అధికారి అన్నారు. ప్రధాని కార్యాలయం, పలు ప్రభుత్వ భవనాలు ఉన్న సెంట్రల్ ఓస్లోలో బాంబు పేలడం వల్ల ఏడుగురు మరణించినట్లు తొలుత పోలీసులు చెప్పారు.
కాల్పుల వ్యవహారంలో 32 ఏళ్ల నార్వేజియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనికి మితవాద తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని టీవీ కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ దాడులను అమెరికా, ఐరోపా దేశాల నాయకులు ఖండించారు.
Twin shooting and bomb attacks left at least 87 dead as a Norwegian gunman disguised as a policeman opened fire at a youth camp and a bomb blast tore through government buildings in downtown Oslo.