రాజీనామాలపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడుతా: సిఎం

ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారానే సాధ్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చర్చలు పూర్తయిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం సెంటరులో బాబూజగన్‌జ్జీవన్‌రాం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడారు. ఎస్సీలందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పదిలక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.1600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
అవినీతి నిర్మూలనలో భాగంగా రానున్న మూడు నెలల్లో ఈ-సేవా కేంద్రాల ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రయోగాత్మకంగా కృష్ణా, ఖమ్మం, చిత్తూరు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వెంకటాచలం మండలంలోని కాకుటూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం అదనంగా 10 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే మత్స్యకారుల విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications