హైదరాబాద్: మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావును ప్రశ్నించారు. ఆదివారం ఉదయం లాల్ దర్వాజ బోనాల జాతరలో పాల్గొన్న రాములమ్మ కాంగ్రెసు పార్టీని విమర్శించడమే కాకుండా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విజయశాంతి వ్యాఖ్యలపై మధుయాష్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెసు నేతలపై విజయశాంతి విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజీనామాలు చేసిన తమని కాకుండా రాజీనామాలు చేయని వారిని ప్రశ్నించాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలపై కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు.
కెసిఆర్ మరోసారి కీలక భూమికను పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజీనామా చేసిన వారిని అభినందిస్తున్నానని అన్నారు. పార్టీల వేర్వేరు ఉద్యమాలతో ఫలితం ఉండదన్నారు. రాజకీయాలకతీతంగా ఉద్యమం చేయాలని సూచించారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ రాజీనామాలు తిరస్కరించడాన్ని తప్పుబట్టలేమన్నారు. రాజీనామాలపై ఒత్తిళ్లు నిజమే అన్నారు.