రజనీ కాంత్ కోసం శ్రీవారిని దర్శించుకున్న సౌందర్య
తిరుపతి: దక్షిణ భారత దేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు, అల్లుడు ఆదివారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య, అల్లుడు అశ్విన్ రామ్ కుమార్‌లు ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం మరింత మెరుగు పడాలని వారు స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పారు.
కాగా రాణా షూటింగు సమయంలో కాస్త అస్వస్థతకు గురైన రజనీకాంత్ కొంతకాలం క్రితం సింగపూర్‌లోని హాస్పిటల్‌లో కొంతకాలం చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సింగపూరులోనే కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల చెన్నై చేరుకున్నారు. ఆయన వచ్చినప్పుడు రజనీకాంత్ అభిమానులు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రజనీ సైతం అభిమానులు పలకరించేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పర్యటించున్నారంట.












Click it and Unblock the Notifications