ఆ అదృశ్యాలు మిస్టరీనా.. మాఫీయానా..?

అదృశ్యమైన వారి వయసు 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు ఉంటుందని బచ్పన్ బచావో ఆందోళన్ (బీపీఏ) స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. వరసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల వల్ల తల్లిదండ్రలు బెంబేలెత్తుతున్నారు.. తమ పిల్లలను బయటకు పంపించేందుకు సంకోచిస్తున్నారు. అయితే బీపీఏ సంస్థ మాత్రం ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. అదృశ్యమైన చిన్నారులు పేద కుటుంబం నుంచి వచ్చిన వారు కావటంతో చదువు సంధ్యలు అబ్బక పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని తన నివేదికలో వెల్లడించింది. ఏదేమైన పోలీసు అధికారులు ఈ అదృశ్యాల పై శ్రద్ధ వహించి దాగి ఉన్న మర్మం ఏంటో కనిపెట్టాలి.
ఇది కచ్చితంగా తీవ్రంగా ఆందోళన కలిగించే విషయమే. దేశ రాజధానిలో రోజుకు ఏడుగురు బాలలు మిస్ అవుతున్నారు. వారిలో చాలామంది ఆచూకి దొరకకపోవడం మరింత కలవరం కలిగించే అంశం. ప్రత్యేకించి జూన్ ఒకటి నుంచి జూలై పద్దెనిమిది వరకు తీసిన లెక్కల ప్రకారం రోజుకు ఏడుగురు గల్లంతు అయినట్లు వెల్లడైంది. ఇప్పటివరకు ఈ నెలన్నర రోజులలో 921మంది పిల్లలు మిస్ అయిపోతే,315మందినే పోలీసులు మాత్రమే కనిపెట్టగలిగారు. బాల్యాన్ని రక్షించండి అన్న ఒక స్వచ్చంద సంస్థ ఈ వివరాలసు సేకరించింది.పిల్లలు తప్పిపోయారా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక పిల్లలు ఎక్కడికైనా పారిపోయారో తెలియక పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. తప్పిపోతున్న పిల్లలలో ఎక్కువమంది పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు కలిగినవారు ఉండడం కూడా రకరకాల అనుమానాలకు అవకాశం ఇస్తోంది.పిల్లలు కనిపించకపోతే ఆ తల్లిదండ్రుల ఆవేదన చెప్పనలవికానిది. ఈ విషయంలో పోలీసులు పూర్తి శ్రధ్ద వహించి ఈ పిల్లల మిస్ అవడంలో మిస్టరీ ఏమిటో కనిపెట్టవలసిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications