విజయవాడ భేటీకి వెళ్లిన తెలంగాణ నేతల అరెస్టు

వేర్పాటు ఉద్యమానికి ఇక్కడ అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని సమైక్యవాదులు తేల్చి చెప్పారు. దీంతో ప్రెస్ క్లబ్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలు ఎంతకూ వినక పోవడంతో పోలీసులు రౌండ్ టేబులు సమావేశానికి వచ్చిన తెలంగాణ నేతలను, సీమాంధ్ర నేతలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications