వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌పై తెలంగాణ నేతల మండిపాటు, కిరణ్‌పై ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: తమ రాజీనామాలను తిరస్కరించడంపై అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు స్పీకర్ నాదెండ్ల మనోహర్ మండిపడుతున్నారు. స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలను తిరస్కరించినట్లు ప్రకటించి నాదెండ్ల మనోహర్ విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై వారు ధ్వజమెత్తారు. నాదెండ్ల మనోహర్‌తో కాంగ్రెసు అధిష్టానం కుట్ర చేసిందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తమ రాజీనామాలను తిరస్కరించే హక్కు స్పీకర్‌కు లేదని ఆయన అన్నారు.

సభాపతి నాదెండ్ల మనోహర్‌కు తమ రాజీనామాలు ఒక ప్రకటనతో తిరస్కరించడం సరికాదని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. స్వచ్ఛందంగా ఇచ్చిన తమ రాజీనామాలను తిరస్కరించే అధికారం సభాపతికి లేదన్నారు. తప్పు చేస్తే స్పీకరును ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుందన్నారు. తెలంగాణ కోసం జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తాము ఎవరి ఒత్తిడులకు లొంగి రాజీనామాలు చేయలేదన్నారు. ఒత్తిళ్లకు లొంగింది స్పీకరే అని ఆరోపించారు. స్పీకరు తమ రాజీనామాలు తిరస్కరించి తెలంగాణ ప్రజలను, తమను అవమానపర్చారని ఆరోపించారు.

స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే జైలుకు వెళ్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కిరణ్ కమార్ రెడ్డి ఇంకా స్పీకర్‌గానే ఉన్నానని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత మందిని అరెస్టు చేస్తారో చేసుకోమనండి అని ఆయన అన్నారు. తమ రాజీనామాలను తిరస్కరించడం ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్ తప్పు చేశారని ఆయన అన్నారు. దేశంలో ఏ స్పీకర్ కూడా చేయని తప్పు ఆయన అన్నారు. సభ్యుల హక్కులను స్పీకర్ కాలరాశారని, స్పీకర్‌గా ఉండే అర్హత నాదెండ్ల మనోహర్‌కు లేదని ఆయన అన్నారు. స్పీకర్ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్తామని, అందుకు నలుగురితో ఓ కమిటీ వేశామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. స్పీకర్ రాజీనామాలను తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వ కుట్రేనని ఆయన ఆరోపించారు.

రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. తమ బాధను, నిరసనను తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ వద్ద వ్యక్తం చేస్తామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తాము చర్యలకు వ్యతిరేకం కాదని, రాజీనామాలను తిరస్కరించడమే తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు.

English summary
All political parties Telangana leaders expressed anguish at assembly speaker Nadendla Manohar for rejecting resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X