హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆధ్యాత్మివేత్త కంటే ముందు భారతీయుడిని: రామ్‌దేవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
హైదరాబాద్: తాను రాజకీయ అధికారాన్ని కోరుకోవడం లేదని రాజకీయ స్వచ్ఛతను కోరుకుంటున్నానని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ మంగళవారం అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని చెప్పారు. అవినీతికి మాత్రమే తాను వ్యతిరేకినని చెప్పారు. ప్రతిపక్షాలు అవినీతిపై పార్లమెంటులో గట్టిగా తమ స్వరం వినిపించాలని సూచించారు. తాను ఆధ్యాత్మిక గురువు కంటే ముందు భారతీయుడిని అని చెప్పారు. అందుకే తాను అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. తనకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదన్నారు. నిస్వార్థ రాజకీయాలే తనకు ప్రధానం అన్నారు.

విదేశీ బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని అన్నారు. వాటిని వెంటనే వెనక్కి తెప్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు నుండి దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా సభలను నిర్వహిస్తానని చెప్పారు. కాగా అవినీతికి వ్యతిరేకంగా మద్దతును కోరడానికి బాబా రామ్‌దేవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అవినీతిపై చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బాబు హామీ ఇచ్చారు. కాగా అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాబాకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

English summary
Yoga Guru Baba Ramdev said today that he is Indian first. He met TDP chief Chandrababu Naidu today and asked support for his anti corruption agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X