కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఆస్తులపై పడిన భూమా నాగిరెడ్డి దంపతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhuma Nagireddy-Shobha Nagireddy
కర్నూలు: ఉపకారవేతనాలతో చదువుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెరిటేజ్‌లు ప్రారంభించి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్రలో భాగంగా డోన్ బహిరంగ సభలో వారు ప్రసంగించారు. హెరిటేజ్ ను ఎలా ఏర్పాటు చేశారో చెప్పలేని చంద్రబాబుకు జగన్‌ను ప్రశ్నించే అధికారం లేదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని, జగన్ ఆ విధంగా సీఎం కావాలనుకోలేదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించగానే తాను సీఎం అవుతానని చంద్రబాబు కలలు గన్నారని, అదే విధంగా రామోజీరావు కూడా చంద్రబాబు సీఎం అవుతాడని అనుకున్నారని చెప్పారు. హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేసుకునేందుకే చిత్తూరు డెయిరీని బాబు మూయించారని భూమా నాగిరెడ్డి విమర్శించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపకుండా ఉండేందుకు చంద్రబాబు సుప్రీం కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారని గుర్తుచేశారు.

ఎమ్మెల్యేలంతా వైఎస్సార్‌ను సీఎంగా చూశాక మరే నాయకుడిని అలా ఊహించుకోలేకపోతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పంచెకట్టుకుని ఆసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఎమ్మెల్యేలంతా కోరుకుంటున్నారన్నారు. అంతకుముందు డోన్ నియోజకవర్గ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ‌రెడ్డి నివాసంలో శోభానాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ - ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రెండెకరాలున్న చంద్రబాబు నేడు వేల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అప్పనంగా భూములు కేటాయించారని, వాటిపైనా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

English summary
YSR Congress party leaders Bhuma Nagi Reddy and Shobha Nagireddy lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X