జగన్ ఆస్తుల కేసులో హైకోర్టుకు సిబిఐ నివేదిక

సిబిఐ 28 కంపెనీలను విచారించింది. ఆ కంపెనీల ఐటి రిటర్న్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఆడిట్ నివేదికలు వంటి వివరాలను అడిగి తీసుకుంది. బెంగుళూర్, కోల్‌కత్తాలకు చెందిన కంపెనీలను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లనే ప్రభుత్వానికి తక్కువ వాటా దక్కిందని సిబిఐ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు మరోసారి సోమవారం సిబిఐ అధికారులకు తమ వాదనలు వినిపించారు. బెంగుళూర్‌కు చెందిన మంత్రి, క్లాసిక్ వంటి సంస్థల ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు