వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కాంగ్రెసు చేతులెత్తేసి బాబు వైపే వేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu and P Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యపై చేతులెత్తేయడానికి తగిన రంగాన్ని కాంగ్రెసు అధిష్టానం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లే కనిపిస్తోంది. దశాబ్ద కాలంగా చెబుతున్న ఏకాభిప్రాయ సాధననే ముందుకు తెచ్చి తెలంగాణ సమస్యను పరిష్కరించలేమని చెప్పకనే చెబుతోంది. పైగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వేలెత్తి చూపుతోంది. తాజాగా, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. రాష్ట్రంలోని పార్టీలు నిట్టనిలువునా చీలిపోయాయని ఆయన అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పార్టీలపై, ప్రజలపై బలవంతంగా రుద్దలేమని ఓ ముక్తాయింపు ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీని వేసి నివేదిక తెప్పించుకున్న తర్వాత కూడా పాత పాటే కేంద్ర ప్రభుత్వం పాడడాన్ని చంద్రబాబుతో పాటు అన్ని వర్గాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు.

ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే తప్ప సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేనట్లు కేంద్ర ప్రభుత్వానికి గానీ కాంగ్రెసు అధిష్టానానికి గానీ లేనట్లు కనిపిస్తోంది. తెలంగాణపై ఒప్పందం చేసుకుని 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన కూడా తెలంగాణ అంశం మొదటి వచ్చినట్లే మాట్లాడుతున్నారు. పైగా, తెలంగాణ నాయకులు, ప్రజల మనోభావాలను పట్టించుకోవడానికి గానీ తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలను గుర్తించడానికి గానీ ఆయన సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు.

తెలంగాణ ప్రజల మనోభావం కాంగ్రెసు అధిష్టానానికి, కేంద్రానికి పట్టలేదని అర్థమవుతోంది. తమ పార్టీలో తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరకపోవడాన్ని అన్ని పార్టీలకూ రుద్దుతోంది. పార్లమెంటులో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గింది. ఏ అంశం మీదనైనా ఓ రాజకీయ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి ఉంటుంది. కాదనో, అవుననో తేటతెల్లం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే, పార్టీకి ఏర్పడే ముప్పునకు కాంగ్రెసు అధిష్టానం భయపడుతోంది. అలా భయపడి తెలంగాణ ప్రాంతాన్నే కాదు, రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ఓ స్పష్టమైన వైఖరి తీసుకుంటే, చంద్రబాబు తేల్చుకుంటారా లేదా అనేది తర్వాత తేలుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెసు అధిష్టానం ఓ జాతీయ పార్టీగా తన వైఖరిని ప్రదర్శించాని అన్ని వైపుల నుంచీ డిమాండ్ వస్తోంది. దాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబుపై వేలెత్తి చూపి తప్పుకోవడానికి చూస్తోంది.

English summary
It is evivent that Congress high command does not want to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X