మీరు వైదొలగండి, తెలంగాణ వస్తుంది: జీవన్ రెడ్డి

ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, మంత్రులు సచివాలయానికి వెళ్లడం మానేస్తే తెలంగాణ రాక పోదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు ప్రతిష్ట పెంచే ఆలోచన ఏమాత్రం ఉన్నట్లుగా కనిపించడం లేదన్నారు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే శ్రద్ధ చూపిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం కావాలి. కానీ విడిపోవడానికి ఎందుకని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజల సెంటిమెంటును గౌరవించి తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెసుకు క్రెడిట్ దక్కుతుందన్నారు. రాజీనామాలు తిరస్కరించడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను చులకన చేశారన్నారు. రాష్ట్రంలో 285 మంది ఎమ్మెల్యేలు తెలంగాణవాదంపై గెలిచారని ఇంతకన్నా ఏకాభిప్రాయం ఎవరికి కావాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications