వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిదంబరంపై చిందులేసిన ఎంపి పొన్నం ప్రభాకర్

తెలంగాణకు అనుకూలంగా తాము గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ మరో లేఖను ఇవ్వాలని ఆయన కోరారు. తెలుగుదేశం ఆ లేఖను ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తేకపోతే తమదే బాధ్యత అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్ష సమావేశంలో వైఖరిని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు వైఖరిని అడగలేదని, అప్పుడు తెలుగుదేశం పార్టీ తన వైఖరి మాత్రమే చెప్పిందని, అదువల్ల ఇప్పుడు కాంగ్రెసు వైఖరిని అడగాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం తన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు.