కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు: నాగలి పట్టి పొలం దున్నిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం నాగలి పట్టారు. నాగలి నొగను పట్టి ఎడ్లను అదిలించి కొద్దిసేపు పొలం దున్నారు. తన ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన ఈ పని చేశారు. కర్నూలు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఆయన మంగళవారం గుడ్డిరాల మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.ఆ తరువాత దేవనకొండ సమీపంలోని పొలాలలోకి వెళ్లి కూరగాయల రైతులను పలకరించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

రాజకీయ లబ్ది కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పడూ హామీలు ఇవ్వలేదని జగన్మోహన రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా దేవనకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాలలో విశ్వసనీయతకు మారుపేరు డాక్టర్ వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. రాముని రాజ్యాన్ని తాను చూడలేదని, రాజశేఖర రెడ్డి సువర్ణయుగాన్ని మాత్రం మనం చూశామన్నారు.

English summary
YSR Congress party president YS Jagan today ploughed field as a part of Odarpu yatra in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X