తెలంగాణ చర్చలు కోర్ కమిటీకి నివేదిస్తా: ఆజాద్

కాగా, మోసపూరిత ప్రకటనలు చేయవద్దని, సీమాంధ్ర నేతల అభిప్రాయాలతో సంబంధం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని తెలంగాణ నేతలు ఆజాద్‌తో చెప్పారు. చర్చలు జరిగిన తీరు పట్ల మంత్రి జె. గీతారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు విధులకు హాజరయ్యే విషయంపై పార్లమెంటు సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. హైదరాబాద్, జలవనరులపై తాము ఆజాద్‌తో మాట్లాడినట్లు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ చరిత్ర, జనాభా, రెవెన్యూ, గ్రేటర్ హైదరాబాద్ మార్పు విషయాలపై తాము ఆజాద్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications