కేంద్రం దిగి రాకుంటే సమ్మెపై తగ్గం: కోదండరామ్

తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు మరోసారి రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు, శరద్ యాదవ్ తదితరులను కలుస్తామని చెప్పారు. రాజీనామాలు చేసిన వారి వెంటనే జెఏసి ఉంటుందని తేల్చి చెప్పారు, తెలంగాణపై స్పష్టమైన హామీ కేంద్రం నుండి రానందుకే సార్వత్రిక సమ్మె అని చెప్పారు. తెలంగాణపై కేంద్రం అనుకూల ప్రకనట చేయకపోతే సమ్మె అనివార్యమన్నారు. వచ్చే నెల 17 నుండి సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేశామని స్వామి గౌడ్ అన్నారు. జెఏసి సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు పలుకుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications