వెంటనే తప్పుకోవాలని యడ్యూరప్పకు బిజెపి ఆదేశం

కాగా కర్నాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప రహస్య ప్రదేశంలో కొందరు మంత్రులు, శాసనసభ్యులతో కలిసి భేటీ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. లోకాయుక్తకు జడిసి తాను ముఖ్యమంత్రి పీఠంపై నుండి వైదొలగేది లేదని ఆయన అధిష్టానంకు తేల్చి చెప్పారు. అయితే తప్పని సరి పరిస్థితుల్లో వైదొలగవలసి వస్తే తాను సూచించిన వ్యక్తినే పీఠంపై కూర్చుండ బెట్టాలని కూడా ఆయన అధిష్టానానికి సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే కర్నాటకలో యెడ్డీ సామాజిక వర్గం ప్రాధాన్యత నేపథ్యంలో ఆయనతో విభేదాలు తెచ్చుకోలేక అధిష్టానం ఆయన సూచించి వారి పేరునే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications