వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై సిబిఐ దర్యాప్తు: మరిన్ని కంపెనీలకు నోటీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులపై దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) గురువారం మరిన్ని కంపెనీలకు నోటీసుల జారీ చేసింది. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన సండూర్ పవర్, జననీ ఇన్‌ఫ్రా, కార్నిల్ ఏషియా కంపెనీలకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. రేపు శుక్రవారం పత్రాలతో సహా తమ ముందు హాజరు కావాలని ఆ కంపెనీలను సిబిఐ ఆదేశించింది. కాగా, గురువారం అరబిందో ఫార్మా సిబిఐ ముందు హాజరై వివరాలు అందించింది.

జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ప్రవహించిన తీరుపై మరింత దర్యాప్తునకు వీలు కల్పించాలని సిబిఐ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన ప్రాథమిక దర్యాప్తును సిబిఐ సీల్డ్ కవరులో హైకోర్టుకు అందించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు మరింతగా దర్యాప్తు చేసి అనుబంధ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తుంది. ఇందుకుగాను సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.

English summary
CBI issued notices to 3 more companies as a part of its probe on YSR Congress party president YS Jagan properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X