వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస ఉచ్చులో చంద్రబాబు, యనమల ప్రకటన తంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి ప్రకటనతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉచ్చులో పడ్డారు. యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనను ఆసరాగా తీసుకుని చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు తెరాస సిద్ధపడింది. యనమల ప్రకటనతో తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టమైందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తాము 2008లో తెలంగాణపై తీసుకున్న వైఖరి తమది కాదని, 2011లో మహానాడు చేసిన తీర్మానమే ఫైనల్ అని, అదే పార్టీ వైఖరి అని యనమల రామకృష్ణుడు అన్నారు. దీన్ని బట్టి చంద్రబాబు సమైక్యవాది అని స్పష్టమైందని హరీష్ రావు అన్నారు.

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం మహానాడులో తీర్మానం చేశారు. యనమల రామకృష్ణుడు ప్రకటనను ఖండించకపోతే చంద్రబాబు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని అనుకోవాలని హరీష్ రావు అన్నారు. సీమాంధ్ర నేతలు తవ్రవాదులు కన్నా హీనమని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి వచ్చి పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం హాల్లో యనమల ప్రకటన చేశారని, యనమల చేత చంద్రబాబు ఆ ప్రకటన చేయించారని ఆయన అన్నారు. హరీష్ రావు, యనమల మధ్య ఓ టీవీ చానెల్ వాగ్వివాదాన్ని నడిపించింది.

తెలంగాణకు అనుకూలమా, వ్యతిరేకమా అని హరీష్ రావు అడిగితే నీకు చెప్పాల్సిన అవసరం లేదని యనమల రామకృష్ణుడు అన్నారు. 2011 మహానాడు తీర్మానం తమ పార్టీ విధానమని యనమల రామకృష్ణుడు మరోసారి చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ కమిటీకి తాము ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర చెప్పగలదా అని కూడా యనమల ఇటీవల అడిగారు. తెలుగుదేశం పార్టీది సమైక్యవాదమే అయితే ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పడుతుందని హరీష్ రావు అన్నారు.

English summary
With TDP senior party leader Yanamala Ramakrishnudu's statement on Telangana, TRS leaders trying attack Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X