హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి అభిప్రాయం మళ్లీ చెప్పేది లేదు: యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అభిప్రాయం మళ్లీ చెప్పవలసిన పని లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గురువారం అన్నారు. తెలంగాణ అంశం నిర్ణయంపై కేంద్రానికే కట్టబెడుతూ 2011 మహానాడులో పార్టీ తీర్మానం చేసిందని దానికే పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. టిడిపి అభిప్రాయాన్ని నిత్యం ప్రశ్నించాల్సిన పని లేదన్నారు. తెలంగాణలో చిచ్చు రగలడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు కొందరు చేస్తున్నట్టుగా కొత్త రాజధానులు, ఉమ్మడి రాజధాని, రెండు రాజధానుల తరహాకు తాము వ్యతిరేకం అన్నారు. కాంగ్రెసు పార్టీ చర్చల పేరుతో తెలంగాణ అంశాన్ని నాన్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. త్యాగాలు చేశామని నిత్యం తెలంగాణవాదులు చెప్పవలసిన పని లేదన్నారు. రాష్ట్రం కోసం తాము రాజధాని, హైకోర్టును త్యాగం చేశామన్నారు. రాష్ట్రం కోసం వారు, మేమూ అందరూ త్యాగం చేశారన్నారు.

English summary
Telugudesam party senior leader Yanamala Ramakrishnudu said today that no need of TDP stand second time on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X