అక్కడే శింగనమల రమేష్‌పై మరో మూడు కేసులు

Singanamala Ramesh
కడప: తెలుగు చలన చిత్ర నిర్మాత శింగనమల రమేష్‌పై మరో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ అనే వ్యక్తి గురువారం శింగనమలపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను శింగనమలకు డబ్బులు ఇచ్చానని, తిరిగి వాటిని అడిగితే తనను చంపుతానని బెదిరించాడని ఆయన ఫిర్యాదు చేశాడు. అదే ప్రొద్దుటూరులో శుక్రవారం మరో మూడు కేసులు తెరపైకి వచ్చాయి. ముగ్గురు సినీ ఫైనాన్షియర్ల నుండి సుమారు రూపాయలు 1.25 కోట్ల అప్పు తీసుకున్నాడు. కానీ ఆ డబ్బులు వారికి తిరిగి ఇవ్వలేదు. దీంతో వారు తమ డబ్బును తాము తిరిగివ్వమని శింగమనలను కోరారు. అతను వారికి డబ్బులు ఇవ్వకుండా వారిని బెదిరించాడు.

దీంతో ఇన్నాళ్లూ వారు మిన్నకుండి ఇప్పుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా డబ్బులు తీసుకొని ఇవ్వకుండా బెదిరించాడనే కేసులు తరుచూ ఒకటి శింగనమల విషయంలో బయట పడుతోంది. షాలిమార్ వీడియో సంస్థల అధినేతలను చీటింగ్ చేశాడని, వైజయంతి రెడ్డి అనే ఫైనాన్షియర్ వద్ద డబ్బులు తీసుకొని ఇవ్వకుండా బెదిరించారనే కేసులలో శింగనమల అరెస్టు అయ్యాడు. అరెస్టు తర్వాత కర్నూలు జిల్లాలోనూ ఆయనపై ఓ కేసు నమోదైనట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+