యెడ్డీ కోసం ఎంపీల పట్టు: కర్నాటకంలో కొత్త ట్విస్టు

2జి కుంభకోణంలో రాజాను తీహారు జైలుకు పంపడానికి బిజెపి ఏడాది పాటు నిర్విరామంగా ఉద్యమించిందని ఆ తర్వాతే ఆయన జైలుకు వెళ్లారని ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చినప్పుడు తప్పించక పోతే ప్రజల్లోకి పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయినా వారు పట్టు వీడక పోవడంతో యడ్డీని తొలగించేందుకు అవసరమైన పక్షంలో అవిశ్వాసం పెట్టడానికి కూడా సిద్ధమని వెంకయ్య వారిని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర పార్టీ సభ్యులు తమ పట్టు వీడలేదని తెలుస్తోంది. రాష్ట్రంలోని శాసనసభ్యులను మచ్చిక చేసుకోవడానికి యడ్డీ తన రాజీనామాకు రెండు రోజుల గడువు కోరినట్లుగా తెలుస్తోంది.
ఈ సమయంలో సభ్యులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు యడ్డీ చేస్తోన్నట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కర్నాటక రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. కాగా మధ్యాహ్నం జరగాల్సిన బిజెపి శాసనసబాపక్ష భేటీ సాయంత్రానికి వాయిదా పడింది. సాయంత్రం భేటీని వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ తదితరులు సమీక్షిస్తారు. ఓ వైపు యడ్డీ కొనసాగేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తుండగా మరోవైపు ముఖ్యమంత్రి పీఠం కోసం సదానంద గౌడ, ఈశ్వరప్ప, జగదీష్ షెట్టార్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. కాగా అధిష్టానం తనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications