జగన్‌పై దర్యాప్తు, మరో ఆరు కంపెనీలకు నోటీసులు

వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడులు పెట్టిన కొన్ని కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సిబిఐ ముందు హాజరై వివరాలు అందించాయి. జగన్ ఆస్తులపై ప్రాథమిక దర్యాప్తు జరిపి సిబిఐ ఇప్పటికే నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అయితే, మరింత దర్యాప్తు అవసరమని సిబిఐ విజ్ఢప్తి చేయడంతో వచ్చే నెల 3వ తేదీ వరకు దర్యాప్తునకు హైకోర్టు అవకాశం కల్పించింది. దీంతో సిబిఐ మరింత దర్యాప్తును చేపట్టింది. దర్యాప్తు తర్వాత అనుబంధ నివేదికను సిబిఐ హైకోర్టుకు సమర్పించనుంది.












Click it and Unblock the Notifications