టిడిపిలో ఫైట్: తెలంగాణపై యనమలకు ఎర్రబెల్లి సవాల్

Errabelli Dayakar Rao
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ విషయంపై 2011 మహానాడు తీర్మానానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తమ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడుపై తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. యనమలకు దమ్ముంటే సమైక్యాంధ్రపై పోలిట్ బ్యూరోలో తీర్మానం పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణపై మాట్లాడే హక్కు యనమలకు లేదన్నారు. కాగా పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలను కొత్త జివో, పాత జివో అంటు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు వక్రీకరించారని హైదరాబాదులో పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కంటే కేంద్రం నిర్ణయమే ముఖ్యమని అన్నారు. 2008, 2011 మహానాడులలో తెలుగుదేశం పార్టీ చేసిన తీర్మానాలు వేరు వేరుగా కావన్నారు. 2008కి కొసాగింపుగానే 2011 తీర్మానం ఉందన్నారు. కర్నాటకలోని అధికార ప్రభుత్వం అవినీతి బయట పెట్టడం ద్వారా కర్నాటక లోకాయుక్త దేశంలోని అన్ని రాష్ట్రాల లోకాయుక్తలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మన రాష్ట్రంలో లోకాయుక్త ఉందా లేక నిద్రపోయిందా అని ప్రశ్నించారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+