తెలంగాణకు 4కళ్ల చంద్రబాబే విలన్: పొంగులేటి

కాంగ్రెసు పార్టీపై బురద జల్లడానికి బదులు టిడిపి ముందు ఖచ్చితమైన వైఖరి ప్రకటించాలని అన్నారు. టిడిపి ముందుకొస్తే తాము అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వస్తామని చెప్పారు. తెలంగాణ అడ్డుకోవడానికి కుట్ర జరుగుతున్నదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న ఈ సమయంలో మంత్రి టిజి వెంకటేష్ గ్రేటర్ రాయలసీమ అని, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మన్య సీమ అని కొత్తగా ప్రతిపాదనలు తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అయితే వారు తమ అభిప్రాయం చెప్పుకోడంలో తప్పులేదన్నారు.












Click it and Unblock the Notifications