వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమరనాథ్ యాత్రికుల పై ‘ఉగ్రనేత్రం’

45 మంది అమరనాథ్ యాత్రికులతో కూడిన బస్సు జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారి మీదగా జమ్ము ప్రాంతానికి తిరిగి వస్తుంది. అయితే బస్సులో అనుమానస్పదంగా లగేజి బ్యాగుల కనిపించటంతో అప్రమత్తమైన బస్సు కండెక్టర్ వెంటనే ఆ సమాచారాన్ని పోలీసు అధికారులకు అందించాడు.
వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ బాంబు స్క్వాడ్ బృందాలు బ్యాగ్ లోని కుక్కర్లలో అమర్చిన పేలుగు పదార్థాలను నిర్వీర్యం చేయటంతో పాటు స్వాధీనం చేసుకున్నాయి. అధునాతన పేలుడు పదర్థాలతో తయారు చేయబడని ఈ ఐఈడీ బాంబులు రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుతాయని, వీటిలో ఆర్డీ ఎక్స్ ను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.