మొండిగా పోతే బంద్: సిఎంకు కెసిఆర్ హెచ్చరిక

3వ తేదిన ముఖ్యమంత్రి, డిజిపి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారని అన్నారు. 4వ తేదిన అఖిల పక్షాలతో రౌండ్ టేబులు సమావేశం, అప్పటికీ ముఖ్యమంత్రి దిగి రాకుంటే 5న బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎస్సై పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థి జెఏసి చేస్తున్న ఆందోళనలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆరునూరైన తెలంగాణ సాధిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications