డిఎంకె నేత స్టాలిన్, సినీనటి ఖుష్బూ అరెస్టు

సమావేశానికి అనుమతి లేకపోవడం వల్లనే స్టాలిన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్టాలిన్ దాదాపు 3 వేల మందితో ప్రదర్శన చేపట్టారు. వారంలో పోలీసులు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి అత్యంత సన్నిహితులైన డిఎంకె నాయకులపై భూకబ్జా వంటి కేసులు పెట్టి అరెస్టు చేస్తూ వస్తున్నారు. భూకబ్జాలపై ప్రభుత్వం 2001 నుంచి విచారణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అన్నాడియంకె నేతల భూకబ్జా వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications