వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పారు.. చేశారు: పార్లమెంటుకు ఎంపీలు డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన శీతాకాలపు పార్లమెంటు సమావేశాలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గైర్హాజరయ్యారు. కాంగ్రెసుకు చెందిన రాజ్యసభ సభ్యులు, లోకసభ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. పార్టీ అధిష్టానం చివరి నిమిషం వరకు వారి హాజరీకి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే మల్కాజిగిరి, హైదరాబాదు ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్‌లు హాజరయ్యారు. కాగా పార్లమెంటు సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొత్త మంత్రివర్గాన్ని సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత మీరాకుమార్ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో మాజీ పార్లమెంటు సభ్యులు భజన్ లాల్, చతురానన్ మిశ్రాలతో పాటు మన రాష్ట్రానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు ధర్మభిక్షం మృతికి సంతాపం తెలిపారు. అనంతరం లోకసభ మంగళవారానికి వాయిదా పడింది.

పార్లమెంటు సమావేశాలకు ముందు రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు ఇంట్లో కాంగ్రెసు ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము పార్లమెంటు సమావేశాలకు హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. తమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాదుతో చర్చించిన తర్వాతే సమావేశాలకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా రాజ్యసభలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు నివాళ్లు అర్పించారు. రాజ్యసభ సభ్యుడు అహ్మద్ అన్సారీ తీర్మానం ప్రవేశ పెట్టారు.

English summary
Telangana Congress MPs were not went for Parliament sessions today. They confirmed that they will go after talk with Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X