వాస్తును అనుసరించకపోతే ఏమవుతుంది? కచ్చితంగా అనుసరించాలా?

వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారిలోనూ, సైన్స్‌ను ఇష్టపడే వారిలోనూ ఎప్పుడూ నలిగే ప్రశ్న ఇది. అస్సలు వాస్తు పాటించకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా? కచ్చితంగా పాటించాలా? అనే విషయాలను ఎలాంటి మూఢనమ్మకాలు లేకుండా, ప్రాక్టికల్‌గా, సైంటిఫిక్‌గా అర్థం చేసుకుందాం.

వాస్తును అనుసరించకపోతే ఏమవుతుంది?
నిజానికి, వాస్తు పాటించనంత మాత్రాన రాత్రికి రాత్రే ఏదో విపత్తు జరిగిపోదు.
కానీ, ప్రకృతి శక్తులకు విరుద్ధంగా ఇల్లు కట్టుకున్నప్పుడు
కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని పెద్దలు చెబుతుంటారు.
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇంట్లో గాలి, వెలుతురు సరిగ్గా లేకపోతే
అది నేరుగా మన మూడ్‌పై ప్రభావం చూపిస్తుంది.
ఉదాహరణకు, ఈశాన్య మూల మూసుకుపోయి ఉంటే
ఉదయం వచ్చే మంచి ఎండ ఇంట్లోకి రాదు.
దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ చీకటిగా ఉండి,
మనుషుల్లో తెలియని చిరాకు, డిప్రెషన్ పెరుగుతాయి.
దీన్నే వాస్తు పరిభాషలో 'నకారాత్మక శక్తి' అంటారు.
నైరుతి లేదా ఆగ్నేయ మూలల్లో లోపాలు ఉంటే
ఇంట్లోని స్త్రీల ఆరోగ్యం క్షీణించడం
లేదా కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్యాలు
రావడం జరుగుతుందని వాస్తు చెబుతోంది.

Vastu What happens if the principles are not followed Is it absolutely necessary to follow it

సైంటిఫిక్‌గా చూస్తే, వంటగది ఉండాల్సిన చోట లేకుండా గాలి సరిగ్గా ఆడని చోట ఉంటే..
ఆ పొగ, వేడి వల్ల ఇంట్లో ఉన్నవారికి శ్వాసకోస సమస్యలు రావడం సహజం.
ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం,
వ్యాపారాల్లో నష్టాలు రావడం వంటివి జరుగుతాయి.
తప్పుడు దిశల్లో బరువులు పెట్టడం లేదా గుమ్మాలు సరిగ్గా లేకపోవడం వల్ల
ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగి, ఆ ప్రభావం
చేసే ఉద్యోగ, వ్యాపారాలపై పడుతుంది.

కచ్చితంగా అనుసరించాలా? అని చాలా మంది అడుతుంటారు.
కచ్చితంగా అనుసరించాలనే నిబంధన ఏ చట్టంలోనూ లేదు.
ఇది పూర్తిగా మీ నమ్మకం, మీ మనశ్శాంతిపై ఆధారపడి ఉంటుంది.
కానీ, ఒక ఇల్లు కట్టేటప్పుడు వాస్తును ఒక గైడ్‌లైన్ లాగా
వాడుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఎందుకంటే పురాతన కాలంలో మన పెద్దలు రాసిన
'వాస్తు శాస్త్రం' వెనుక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది.

ఉదయం ఎండ వచ్చేలా ఈశాన్యం ఖాళీగా ఉండాలి
పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలలో విటమిన్-డి ఉంటుంది.
అది ఇంట్లోని బ్యాక్టీరియాను చంపేసి,
మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది.
ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి
మన దేశంలో గాలి ఎక్కువగా నైరుతి నుంచి ఈశాన్యం వైపు వీస్తుంది.
వంటగది ఆగ్నేయంలో ఉంటే, వంట వండేటప్పుడు వచ్చే పొగ, వాసనలు
ఇల్లు మొత్తం పాకకుండా నేరుగా బయటకు వెళ్లిపోతాయి.
నైరుతి మూల బరువుగా, ఎత్తుగా ఉండాలి
మధ్యాహ్నం తర్వాత సూర్యుడి నుంచి వచ్చే 'ఇన్‌ఫ్రారెడ్' కిరణాలు చాలా హానికరమైనవి.
నైరుతిలో పెద్ద గోడలు లేదా మాస్టర్ బెడ్‌రూమ్ కట్టడం వల్ల
ఆ వేడి ఇల్లు మొత్తం వ్యాపించదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+