యువతిపై కత్తితో దాడి: ప్రేమికుడు ఆత్మహత్య

మురళి వేధింపులు తట్టుకోలేక సౌజన్య ఢిల్లీ నుండి వచ్చింది. ఇక్కడ కూడా పెళ్లి కోసం మురళి వేధించసాగాడు. ఆ తర్వాత సౌజన్య ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. మురళీ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఉద్యోగం సైతం మానేసింది. సౌజన్యపై కోపంతో మురళీ సోమవారం రాత్రి మల్కాజిగిరిలోని ఆమె ఇంటికి కత్తితో వెళ్లాడు. ఆమెపై దాడి చేస్తున్న సమయంలో సౌజన్య కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే అపోలో హాస్పిటల్ తరలించారు. దాడి అనంతరం మురళి కూడా విషం తాగాడు. అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మురళి మృతి చెందాడు.












Click it and Unblock the Notifications