నా వద్ద లాప్‌ట్యాపే లేదు, వార్తలు అబద్ధం: వెంకయ్య

Venkaiah Naidu
బెంగుళూర్: కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన లాప్‌ట్యాప్‌ను ధ్వంసం చేసినట్లు వచ్చిన వార్తలను బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు ఖండించారు. ఆదివారంనాడు ఆగ్రహంతో యడ్యూరప్ప వెంకయ్య నాయుడు లాప్‌ట్యాప్‌ను ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు తన వద్ద లాప్‌ట్యాపే లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

అత్త మీది కోపం దుత్త మీద చూపినట్లు కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన ఆగ్రహాన్ని బిజెపి జాతీయ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడి లాప్‌ట్యాప్‌పై చూపించారని వార్తలు వచ్చాయి. తనను సముదాయించడానికి ప్రయత్నిస్తున్న వెంకయ్యనాయుడిపై ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంకయ్య నాయుడి లాప్‌ట్యాప్‌ను లాక్కుని కిందికి విసిరికొట్టారు. ఆదివారంనాడు హోటల్ లలిత్ అశోక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తనకు సన్నిహితుడైన ఓ మంత్రి తనను రేస్ కోర్సు రోడ్డులోని నివాసంలో నిద్ర లేపినందుకు కూడా యడ్యూరప్ప తన ఆగ్రహాన్ని చూపించారని అంటున్నారు. ఆ మంత్రి చెంపపై ఆయన చెల్లుమనిపించారని సమాచారం. రాజీనామా చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ఆయన తట్టుకోలేని మానసిక స్థితికి వెళ్లారని చెబుతున్నారు. యడ్యూరప్పను సమర్థిస్తూ వచ్చిన వెంకయ్య నాయుడు ఆయనను తొలగించే విషయంలో జాతీయ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+