హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చుక్కా రామయ్యకు టీచర్ల నుంచి చేదు అనుభవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chukka Ramaiah
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ చుక్కా రామయ్యకు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ ఉపాధ్యాయుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల కార్యకర్తలు బుధవారం ఇందిరా పార్కు వద్ద ఒక్క రోజు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వచ్చిన చుక్కా రామయ్యను ఉపాధ్యాయులు నిలదీశారు. చుక్కా రామయ్య సిపిఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యుటిఎఫ్) నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది టీచర్ల అభ్యంతరం. తెలంగాణపై యుటిఎఫ్ వైఖరి స్పష్టం చేయాలని ఉపాధ్యాయులు చుక్కా రామయ్యను డిమాండ్ చేశారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తోంది.

చుక్కా రామయ్య ప్రసంగానికి టీచర్లు అడ్డు తగిలారు. తాను ఏ ఒక్క సంఘానికో చెందినవాడిని కాదని, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చుక్కా రామయ్య చెప్పారు. కాగా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా టీచర్లు అనుమతించలేదు. ధర్నా శిబిరానికి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా టీచర్లు నినాదాలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వెనక్కి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. తాను పిలిస్తేనే వచ్చానని చెప్పినా వారు వినలేదు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు వెనక్కి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Telangana teachers opposed MLC Chukka Ramaiah and demanded UTF stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X