తెలంగాణపై సుష్మా స్వరాజ్‌తో లగడపాటి పోటీ

తెలంగాణపై సావధాన తీర్మానం కింద మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సుష్మా స్వరాజ్ ఇదివరకే నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు కింద ఆమె ప్రతిపాదించిన తీర్మానం ఈ నెల 9వ తేదీన చర్చకు వచ్చే అవకాశం ఉంది. సుష్మా స్వరాజ్ తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె వాదనను ఖండించడానికే లగడపాటి రాజగోపాల్ తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications