తెలంగాణపై పార్లమెంటులోనూ చిదంబర అదే పాట

రహస్య నివేదిక ఇవ్వాలని కమిటీకి తాము సూచించలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు రాష్ట్రంలో అందరూ తెలంగాణ కోరుకున్నారని ఆ ప్రకటన తర్వాత ప్రాంతాల వారిగా చీలిపోయారన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో సైతం ప్రాంతాల వారిగా చీలిక వచ్చిందన్నారు. సామరస్య పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యువకుల ఆత్మహత్యలు బాధాకరం అన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
సిపిఐ, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు సానుకూలంగా ఉండగా, సిపిఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలలో ఏకాభిప్రాయం లేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తమ అభిప్రాయం చెప్పలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో కలిసి పోయిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు పరిష్కారం రాష్ట్రం నుండే రావాలని పార్లమెంటు కేవలం వేదిక మాత్రమే అని చెప్పారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications