'వైయస్ జగన్ వెంట వెళుతున్న నేతలపై చర్యలేవి?'

పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిపై చర్యలు తీసుకోవాలని వారు సూచించినట్లుగా తెలుస్తోంది. లేదంటే అలాంటి వారితో పార్టీ పతనం ఖాయమని వారు ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి వల్ల అసలైన కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటోందని వారు ఆవేదన చెందినట్లుగా సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారనప్పటికీ నియోజక వర్గాలలో కాంగ్రెసు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ పర్యటిస్తున్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అవమానించినప్పటికీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు బొత్స ముందు ఆవేదన చెందినట్లుగా సమాచారం. జిల్లాలో, కాంగ్రెసు పీఆర్పీ నేతల మధ్య సఖ్యత కుదుర్చాలని విజ్ఞప్తి చేశారని సమాచారం.












Click it and Unblock the Notifications