జైపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కెటిఆర్

పార్లమెంటులో చిదంబరం వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనం అన్నారు. తెలంగాణపై ప్రధాన ప్రతిపక్షం బిజెపి స్టాండ్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ సమస్యను నాన్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసుండాలనే అంశంపై ఏకాభిప్రాయం కోరని కేంద్రం విభజన అంశంపై ఏకాభిప్రాయం అంటూ ఊగులాడటం ఏమిటని ప్రశ్నించారు. పార్టీని వీడుతామని కాంగ్రెస్ ఎంపీలంతా కేంద్రానికి స్పష్టమైన హెచ్చరికలు చేయాలని, అప్పడే కేంద్రం దిగివస్తుందన్నారు. తెలంగాణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన బీజేపీ నేత సుష్మ స్వరాజ్, సిపిఐ నేత గురుదాస్ గుప్తాలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications