మొండికేసిన సిఎం, దిగిరాని తెలంగాణ జెఎసి

ఎస్సై రాత పరీక్షలను 45 రోజులు వాయిదా వేయాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఎస్సై రాత పరీక్షలను ఈ నెల 13, 14 తేదీలలోన నిర్వహిస్తే అడ్డుకుని తీరతామని తెలంగాణ ఆయన చెప్పారు. 14 ఎఫ్‌ను తొలగించకుండా ఎస్సై పరీక్ష నిర్వహించడానికి తామెట్టి పరిస్థితిలలోనూ అంగీకరించబోమని ఐకాస ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఎనిమిదో తేదీన బంద్ ఉంటుందని తామెప్పుడూ ప్రకటించలేదని కోదండరామ్ చెప్పారు. పట్టుదలకు వెళ్లి పరీక్ష నిర్వహించాలనుకుంటే ముఖ్యమంత్రికే నష్టమని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications