కామన్‌వెల్త్ స్కామ్, షీలా దీక్షిత్‌పై తీవ్ర దుమారం

కాగ్ నివేదిక తనకు ఇంకా నివేదిక అందలేదని, నివేదికపై పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని షీలా దీక్షిత్ చెప్పారు. షీలా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, కర్ణాటక లోకాయుక్త నివేదికతో కాగ్‌ను పోల్చలేమని కేంద్ర న్యాయమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. నివేదిక పార్లమెంటు ముందు ఉందని, నిర్ణయం తీసుకొనే అవకాశం దానికి ఇవ్వాలని సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వం మీద కాగ్ వ్యాఖ్యలు ఇవి -
- వీధి దీపాలకు రూ.30.07 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారు. దిగుమతి చేసుకున్న సంస్థ ఇన్వాయిస్ పట్టికతో పోలిస్తే చాలా ఎక్కువ ధర పెట్టినట్లు తెలుస్తోంది.
- క్రీడా ప్రాంగణాల దగ్గర తాత్కాలిక పద్ధతిన వీధుల సుందరీకరణకు కిలోమీటర్‌కు రూ.4.8 కోట్లు చొప్పున రూ.101.02 కోట్లు ఖర్చు పెట్టారు. పాదర్శకత లేకుండా కన్సల్టెంటుకే పని అప్పగించారు.
- ఏడేళ్లపాటు అత్యవసర సేవల కమ్యూనికేషన్ నెట్‌వర్క్ నిర్వహణకు 99.81 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. దీని అవసరమే లేదు.












Click it and Unblock the Notifications