కెసిఆర్‌కు చెక్: బాపూజీతో కొత్త తెలంగాణ కమిటీ

ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ నేతృత్వంలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నాయకత్వంలో తెలంగాణ రాజకీయ జెఎసికి ప్రత్యామ్నాయంగా మరో కమిటీని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. వారిద్దరు అందుకు అంగీకరించకపోవడంతో కొండా లక్ష్మణ్ బాపూజీతో సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రయత్నాలు సాగించి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు, తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెసు మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు హాజరయ్యారు.
తెరాసపై, తమ పార్టీ నుంచి సస్పెండైన నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. బాపూజీ చెప్తే పదవులనే కాదు, పార్టీని కూడా వదులుకుంటామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, సమాంతర పాలన సాగించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటీవల అన్నారు. దాన్నిబట్టి, రాజీనామాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాగా, కార్యాచరణను ఖరారు చేయడానికి తిరిగి ఈ నెల 19వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications