వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: ఎర్రబెల్లి దయాకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం తప్పు బట్టారు. కెసిఆర్ ప్రస్తుత ఉద్యమం గురించి మాట్లాడకుండా 2014 గురించి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పదకొండేళ్లుగా తెలంగాణ వస్తుందని కెసిఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికలంటూ మాట్లాడింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అని విమర్శించారు. ఇందుకు కెసిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 11, 12వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని చెప్పారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులను తెలంగాణకు ఒప్పిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సైతం మరోసారి రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. అయితే రాజీనామాలు రాజకీయ సంక్షోభానికి ఉపయోగ పడాలే కానీ రాజకీయ లబ్ధికి ఉపయోగపడకూడదని తమ ఉద్దేశ్యం అన్నారు. తెలంగాణపై కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. కేంద్రానికి టిడిపి మరోసారి లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, కె కేశవరావు చెప్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TDP senior MLA Errabelli Dayakar Rao demanded for TRS chief K Chandrasekhar Rao apology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X