ఇటలీ వనితను మెప్పించడానికేనా?: ప్రధానికి రేవంత్‌రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 14ఎఫ్ పై కళ్లులేని కబోదిలా ఉందన్నారు. తెలంగాణపై ప్రధానమంత్రి కళ్లు తెరిచి చూడాలని సూచించారు. మన్మోహన్ ఒక్కడు నీతిగా ఉంటే సరిపోదని, పగ్గాలు చేపట్టినందుకు పాలన సక్రమంగా చేయాలని అన్నారు. మన్మోహన్ ప్రధాని అని గుర్తుంచు కోవాలన్నారు. 14ఎఫ్ రద్దు చేశాకే ఎస్సై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 14ఎఫ్ రద్దుకు ఏకాభిప్రాయం అవసరం లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే విభజన ఆవశ్యం అని అన్నారు. బాగున్న సోనియా గాంధీ కోసం పూజలు చేస్తున్న కాంగ్రెసు నేతలు అసువులు బాసిన విద్యార్థుల కోసం ఏం చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications