విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ భేటీ ఉద్రిక్తం, విద్యార్థులు, నేతల పరస్పర దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో తెలంగాణ-ఆంధ్రా ప్రాంత నేతలు నిర్వహించిన ఆంధ్రా - తెలంగాణ ఫోరం భేటీ ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పర దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో సమైక్యాంధ్ర జెఏసి కన్వీనర్ ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. భేటీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించడం తదితర నేపథ్యంలో విజయవాడ పోలీసులు భేటీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఫోరం నేతలు రహస్యంగా స్వాతంత్ర్య సమర యోధుల భవనంలో భేటీ అయ్యారు. ఈ భేటీని కనుగొన్న సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి అక్కడకు చేరుకొని భేటీని అడ్డుకుంది.

ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఫోరం నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ జరిపారు. సమైక్యంధ్ర జెఏసి విద్యార్థి నేత సాయికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సద్దుమణగక పోవడంతో పోలీసులు విద్యార్థులను, తెలంగాణ నేతలను అరెస్టు చేశారు.

కాగా స్వేచ్ఛకు భంగం కలిగించే ఉద్దేశ్యం తమకు లేదని అయితే హైదరాబాదులో సమైక్యాంధ్ర వాదుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో సమైక్యవాదులను రెచ్చగొట్టడానికే నిర్వహించ తలపెట్టిన భేటీని మాత్రమే మేం అడ్డుకున్నామని జెఏసి నేతలు చెబుతున్నారు. గతంలో తెలంగాణ వాదులు అయిన వి హనుమంతరావు తదితరులు వచ్చినప్పుడు తాము అడ్డుకోలేదన్నారు. భేటీ పేరుతో సమైక్యవాదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నందు వల్లే తాము అడ్డుకున్నామని చెప్పారు.

English summary
Telangana - Andhra meeting obstructed by Samaikyandhra Student JAC today in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X