హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై రోశయ్యను వెనుకేసుకొచ్చిన దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఆయనకు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అండగా నిలబడ్డారు. అసెంబ్లీ తీర్మానం విషయంలో రోశయ్యను వెనుకేసుకొచ్చారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెడ్డపేరు రావద్దనే రోశయ్య అసెంబ్లీ తీర్మానం ప్రవేశ పెట్టలేదని చెప్పారు. తీర్మానం ప్రవేశ పెడితే వీగిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. 14ఎఫ్ కేంద్రం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.

తెలంగాణపై పిఎసిలో వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తాననడం హాస్యాస్పదం అన్నారు. కాగా 14ఎఫ్ రద్దు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల మాజీ మంత్రి షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి లేఖ రాసినందుకు సిఎంకు కృతజ్ఞతలు చెప్పారు. రంజాన్ సందర్భంగా రాస్తారోకోలు, బందులు వాయిదా వేసుకోవాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. 14ఎఫ్ రద్దు చేశాకే పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Minister Danam Nagender supported former chief minister Rosaiah on Telangana resolution issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X