కాంగ్రెసు కోర్ కమిటీలోకి రాహుల్ గాంధీ?

కోర్ కమిటీలో సభ్యుడిగా నియమించిన తర్వాత రాహుల్‌కు రాజకీయపరంగా ప్రత్యర్థులను ఎదుర్కునే శిక్షణను మరింతగా అందించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా మాట్లాడటం అందులో ముఖ్యమైన అంశమని అంటున్నారు. ఇప్పటికే రాహుల్ ఒకటి, రెండు సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడే సూచనలను ఆయన తీసుకుంటారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై రాహుల్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ మూడు రాష్ట్రాలు ముఖ్యమని కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలలో రాహుల్ ముమ్మరంగా ప్రచారం చేసినా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆ పరిస్థితిని అధిగమించటానికి రాహుల్‌ను ఇప్పటినుంచే సమాయత్తం చేయటం కోసమే ఆయనను కోర్ కమిటీలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు ఏఐసీసీ సీనియర్ నేతలు కొందరు తెలిపారు.












Click it and Unblock the Notifications