వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి: రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: తెలంగాణపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం విశాఖపట్నంలో విలేకరులతో అభిప్రాయపడ్డారు. తనకు ఏ ప్రాంతీయ ఉద్యమాలతో సంబంధం లేదన్నారు. తాను ఇరు ప్రాంతాలను సమానంగానే చూస్తానని అన్నారు. ప్రాంతీయ వాదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ఓ టీవీ కార్యక్రమంలో రోశయ్యపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన తర్వాత నాటి ముఖ్యమంత్రి రోశయ్య సీమాంధ్రులతో రాజీనామాలు చేయించారని, ఈ విషయం తనకు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి స్వయంగా చెప్పారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Former chief minister Koniketi Rosaiah suggested central government on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X