తెలంగాణ సమ్మె: మద్యం, జల్సాలు బంద్

ప్రభుత్వానికి ఒక్క హైదరాబాదు నుంచే నెలకు 250 కోట్ల రూపాయల ఆదాయం, మిగతా తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. మద్యం సేవించడం మానేస్తే తెలంగాణ నుంచి మద్యం ఆదాయానికి 500 కోట్ల రూపాయల మేరకు గండి పడే అవకాశం ఉంది. సమ్మె కాలంలో జల్సాలు కూడా మానేయాలని స్వామిగౌడ్ తెలంగాణ ప్రజలను కోరారు. సినిమాలు చూడడం కూడా మానేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్వామి గౌడ్ పిలుపును వైన్ షాపు డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రావు తప్పు పట్టారు. మద్యం తాగడం మానేస్తే నష్టపోయేది తెలంగాణ వ్యాపారులేనని, ప్రభుత్వానికి సంభవించే నష్టం చాలా తక్కువ అని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. శ్రావణ మాసం వల్ల తాగడం తగ్గడంతో ఇప్పటికే తమ ఆదాయం తగ్గిందని, తెలంగాణ సమ్మె వల్ల మద్యం తాగడం మానేస్తే తమకు మరింత నష్టం వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications